వాటర్‌ ప్రెజర్‌ పంప్‌ మిషిన్లు బహూకరణ

ప్రజాశక్తి – ద్వారకా తిరుమల

శ్రీవారి గోసంరక్షణ శాలకు రూ.3.50 లక్షల విలువైన 3 వాటర్‌ ప్రెజర్‌ పంప్‌ మిషిన్లను స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ వారు అందజేశారు. ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావు వాటిని ప్రారంభించారు. ముందుగా గోసంరక్షణశాలలో మిషిన్లకు ఆయన పూజలు నిర్వహించి అనంతరం ప్రారంభించారు. ఈ సందర్భం ఇఒ మాట్లాడుతూ గోశాలను, ఆవులను శుభ్రపరచేందుకు ఇవి ఉపకరిస్తాయన్నారు. గోశాలకు అవసరమని తెలిసి వీటిని బహూకరించిన యూనియన్‌ బ్యాంక్‌ వారిని ఇఒ అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ ఎం.గోపాలకృష్ణమూర్తి, డిప్యూటి రీజనల్‌ హెడ్‌ డి.రామ్మోహన్‌రావు, స్థానిక బ్రాంచి మేనేజర్‌ కె.నాగశేషు పాల్గొన్నారు.

➡️