వామపక్షాల భారీ ర్యాలీ, రాస్తారోకో

Jan 9,2024 19:01
ర్యాలీ నిర్వహిస్త్ను వామపక్షాలు

ర్యాలీ నిర్వహిస్త్ను వామపక్షాలు
వామపక్షాల భారీ ర్యాలీ, రాస్తారోకో
పలువురు నాయకులు అరెస్టు, విడుదల ప్రజాశక్తి-నెల్లూరు : హామీలు అమలు చేయాలంటూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌ వాడీలపై ప్రభుత్వం ‘ఎస్మా’ ప్రయోగిస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ అంగన్‌వాడీలకు మద్దతుగా మంగళవారం వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో రాస్తారోకో చేపట్టారు.తొలుత నగరంలోని ఎబిఎం కాంపౌండ్‌ నుంచి విఆర్‌సి సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ నేతృత్వం వహించారు. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనకు గాంధీబొమ్మ సెంటర్‌లో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ Vంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు పాల్గొని అంగన్‌వాడీల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ ప్రదర్శనను భగం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. అందులో భాగంగా రాస్తారోకో చేస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.వి.వి ప్రసాద్‌, కె.అజరుకుమార్‌,రూరల్‌ సిఐటియు నాయకులు కిన్నెర కుమార్‌, బత్తల కృష్ణయ్య, ఐద్వా జిల్లా నాయకులు షేక్‌ మస్తాన్‌భీ, నగర నాయకురాలు కె.పద్మ, టి.శివకుమారిలను పోలీసులు అరెస్టు చేశారు. ఒకటో నగర పోలీసు స్టేషన్‌కు తరలించారు. నేతల అరెస్టు సమాచారం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన తమ నేతలను వదిలే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకూర్చున్నారు. దీంతో పోలీసులు అరెస్టు చేసిన నాయకులను వదిలిపెట్టారు. అక్కడ నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు చేస్తున్న 24 గంటల రిలే దీక్షా శిబిరానికి చేరుకున్నారు. వారికికి సంఘీభావం తెలిపారు. తొలుత సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడారు. ప్రతిపక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలకు చేసిన హామీలను అమలు చేయాలని 29 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తుంటే స్పందించకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించకుండా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెను భగం చేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే విధుల్లోకి హాజరు కావాలని లేనిపక్షంలో ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించడం దారుణమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను పరి ష్కరించకుండా ఎస్మా ప్రయోగిస్తామని చెప్పడం ముఖ్యమంత్రి చేతగానితనానికి నిద ర్శనమన్నారు. పౌరహక్కుల సంఘం నాయకులు అబ్బయ్యరెడ్డి, ఎల్లంకి వెంకటేశ్వర్లు , ఐఎఫ్‌టియు నాయకులు లక్ష్మీరెడ్డి, సిఐటియు నాయ కులు కత్తి శ్రీనివాసులు, రైతు సంఘం సీనియర్‌ నాయకులు చండ్ర రాజగోపాల్‌, డివైఎఫ్‌ఐ, ఆటో కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, మున్సిపల్‌కార్మికులు, వ్యవసాయ, రైతు, కౌలు రైతు సం ఘాల నాయకులు, పలువురు ప్రజాసంఘాల నేతలు మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️