వాలంటీర్లతోనే ప్రభుత్వానికి మంచిపేరు

Feb 16,2024 21:44

 ప్రజాశక్తి-డెంకాడ : వాలంటీర్లు అందిస్తున్న సేవల వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో వాలంటీర్ల సేవలకు వందనం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. మండలంలో సుమారు 300 మంది వాలంటీర్లలకు సేవా పురస్కారాలు అందించి, సత్కరించారు. కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్‌ ఎంపిపిలు పిన్నింటి తమ్మునాయుడు, అనిత, ఎంపిడిఒ ఎ.లవరాజు, తహశీల్దార్‌ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️