వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

Mar 26,2024 21:41

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్న ప్రజాహిత పాలనకు కీలకంగా ఉన్న వాలంటీర్లపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సరికాదనిడిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. మంగళవారం 6, 7 డివిజన్‌ పరిధిలలో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్తుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన స్వయంగా ఇంటికీ వెళ్లి పింఛన్లను అందజేయ డంతో వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అందుకే వాలంటీర్లపై గంటకో మాటను మాట్లాడుతున్నారని అన్నారు. వాలంటీర్‌ వ్యవస్థను దెబ్బతీయాలని ఎన్నో కుయుక్తులు పన్నారని అన్నారు. వాలంటీర్లను ఎన్నికల అనంతరం తొలగించబోమని బయటకు ప్రకటిస్తున్నప్పటికీ లోలోపల అంతర్మధనం చెందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయ యాదవ్‌, రాష్ట్ర పరిశ్రమల అభివద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, జోనల్‌ ఇన్చార్జిలు బొద్దాన అప్పారావు, బోడ సింగి ఈశ్వరరావు, రెడ్డి గురుమూర్తి, స్థానిక కార్పొరేటర్లు పొంతపల్లి మాలతి, ఆల్తి సత్యకుమారి, గాదం మురళి, మాజీ కౌన్సిలర్‌ కోరాడ సూరి ప్రభావతి, గదుల సత్యలత తదితరులు పాల్గొన్నారు.

➡️