విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించండి

చిలకలూరిపేట: పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాదిరి విఆర్‌ఎలకు పే స్కేల్‌ వర్తింప చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ విఆర్‌ఎ సంఘం అధ్యక్షులు టి. ఆనంద్‌ కుమార్‌ అన్నారు. స్థానిక పండరీపురంలో ని సిఐటియు కార్యాలయంలో ఆదివారం విఆర్‌ఎల సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్‌ మాట్లా డుతూ ఖాళీగా ఉన్న విఆర్‌ఒ ఉద్యోగాలను విఆర్‌ఎల చేత భర్తీ చేయించాలని, రికవరీ చేసిన అమౌంట్‌ మొత్తా న్ని విఆర్‌ ఎల ఖాతాకు వెంటనే జమ చేయాలని , నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్‌ ఎలుగా రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. తక్కువ జీవితాలతో కాలం వెళ్లబుచ్చుతున్న తమను ప్రభుత్వ ఉన్నత ఉద్యోగుల మాదిరి గా ప్రభుత్వ పథకాలు లేకుండా చేయడం అన్యాయమన్నారు. ప్రతి విఆర్‌ ఎకు వెంటనే ప్రభుత్వ పథకాలు అ మల య్యేలా చేయాలన్నారు. రీ సర్వేలో విఆర్‌ ఎలను సొంత గ్రామాల్లో కాకుండా ఇతర రెవెన్యూ గ్రామాల్లో పని చేయుంచ కూడ దని, గ్రామ రెవెన్యూ సంచాలకుల చేత అక్రమ డ్యూటీలను చేయించట అన్యాయ మన్నారు. విఆర్‌ఎల నిబం ధనలకు వ్యతిరేకంగా ఎక్కడా వారితో డ్యూటీలను చేయించొద్దని అన్నారు. విఆర్‌ఎలు శ్రమదోపిడికీ గురువుతున్నారని అన్నారు. ఈ నెల 31వ తేదీలోపు తమ సమస్యలను పరిష్కరించక పోతే విఆర్‌ ఏలు సమ్మె బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

➡️