వికలాంగులకు చేయూతని అందించండి

ప్రజాశక్తి- కొత్తవలస : వికలాంగులకు చేయూతని అందించడం మన బాధ్యత అని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం శ్రీగురుదేవ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆవరణలో వికలాంగులకు ఉపకరణాలు అందించే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు మౌలిక వసతులు కల్పించడానికి విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్‌ శాతం పెంచారని, పింఛన్‌ సౌకర్యం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉపకరణాలకు తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. వికలాంగులకు దేవతామూర్తులుగా చూడా లని వీరికి మనోధైర్యం కల్పించి సమాజంలో అన్ని రంగాలలో ప్రముఖ స్థానం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల అధ్యక్షులు నీలంశెట్టి గోపమ్మ, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, తుమ్మకాపల్లి సర్పంచ్‌ విరోతి కొండలరావు, డిఎం అండ్‌ హెచ్‌ఒ భాస్కర రావు, ప్రభుత్వ వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వరరావు, శ్వేత, గురుదేవా చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత జగదీష్‌ బాబు, డాక్టర్‌ మణికంఠ, డాక్టర్‌ గణపతి, అధిక సంఖ్యలో ప్రభుత్వ అధికారులు స్థానిక నేతలు పాల్గొన్నారు.

➡️