విద్యతో సమాజ నిర్మాణానికి పునాది

స్టడీ మెటీరియల్‌ అందుకున్న విద్యార్థులతో శ్రీ చారిటబుల్‌ ట్రస్టు ఛైర్మన్‌ మోకా రమాదేవి

ప్రజాశక్తి-అంబాజీపేట

మెరుగైన సమాజ నిర్మాణానికి విద్య పటిష్టమైన పునాది అని శ్రీ చారిటబుల్‌ ట్రస్టు ఛైర్మన్‌ మోకా రమాదేవి సత్తిబాబు అన్నారు. అంబాజీపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ నందు శ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో షెడ్యూల్‌ కులాల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు నందిపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం గ్రూప్‌ -1, 2 పరీక్షలకై నమోనా పరీక్ష మరియు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రమాదేవి మాట్లాడుతూ ఉన్నతమైన విద్య, నైతిక విలువలను, జీవన విలువలను, అందిస్తుందన్నారు. ట్రస్టు నిర్వహించిన రాత పరీక్షకులకు 400 మంది హాజరు కాగా పాస్‌ అయిన వంద మందికి ఉచిత స్టడీ మెటీరియల్‌ సెట్‌ లను ఆమె అందించారు. అందులో మరో 100 మందిని ఎంపిక చేసి ఉచితంగా కోచింగ్‌ ఏర్పాటు చేశామని, ఆన్లైన్‌ క్లాసులు కూడా ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత శిఖరాల్లో నిలవాలని ఆమె ఆకాంక్షించారు. ఎస్‌సి వెల్ఫేర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గోసంగి బంగార్రాజు మాట్లాడుతూ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిరపడ్డారన్నారు. ట్రస్ట్‌ ద్వారా మెటీరియల్‌, శిక్షణ పొంది ఎస్‌ఐ ఉద్యోగాలు పొందిన వారిని సన్మానించి అభినందించారు. 2024 లో ఇంటింటా ఆనందాలు ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ట్రస్ట్‌ చైర్మన్‌ రమాదేవి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డి.వెంకటేశ్వరరావు, జెడ్‌పిటిసి సభ్యుడు బూడిద వరలక్ష్మి, సొసైటీ చైర్‌ పర్సన్‌ డి.సత్యమోహన్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ సభ్యులు గెడ్డం ప్రదీప్‌, పరమట నాని, కోట విజయారావు, వెన్నపు సత్యనారాయణ, వీరిన గోపాలం,గూటం సాయి, హైస్కూల్‌ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

 

➡️