విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

ప్రజాశక్తి- బాడంగి: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు స్థానిక జెడ్‌పిటిసి పెద్దింటి రామారావు చేతుల మీదుగా బైజ్యూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభు త్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ఏటా ట్యాబ్‌లు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు లక్ష్మణదొర, రాజేశ్వరి, ప్రధానోపాధ్యాయులు సత్య నారాయణ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.వేపాడ: మండలంలోని సోంపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 22 మంది 8వ తరగతి విద్యార్థు లకు సర్పంచ్‌ మురిపిండి గంగరాజు చేతుల మీదుగా శుక్రవారం ట్యాబ్‌లను పంపిణీ చేశారు. పాఠశాలలో గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్‌కు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన గణిత నమూనాల ప్రదర్శన, గణిత రంగవల్లి లఘు నాటికలు, వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, పాఠశాల కమిటీ అధ్యక్షులు ఎల్‌ నూకరత్నం, గణిత శాస్త్రం ఉపాధ్యక్షులు రవి శంకర్‌, పి రమేష్‌ నాయుడు పాల్గొన్నారు. బికే నాయుడుపేట ఎపి ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు శుక్రవారం జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ రావాడ ఈశ్వరరావు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ బి సన్యాసిరావు, వైసిపి నాయకులు గండి శ్రీరామ్మూర్తి, ఆదర్శ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.గజపతినగరం: మండలంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, మరుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలలో శుక్రవారం 8వ తరగతి విద్యార్థులకు ఎంపిపి బెల్లాన జ్ఞాన దీపిక , జెడ్‌పిటిసి గార తౌడు చేతుల మీదుగా బైజూస్‌ కంటెంట్‌ తో కూడిన ట్యాబ్‌లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, .ప్రభుత్వం ఎంతో వ్యయంతో బై జ్యూస్‌ కంటెంట్‌ కూడిన ఈ ట్యాబ్‌లు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయ న్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సాయి చక్రధర్‌, ప్రధానోపా ధ్యాయులు చిప్పాడ రమేష్‌ కుమార్‌, మీసాల వెంకటేశ్వరరావు ,నాగమణి, పిఎసిఎస్‌ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, సర్పంచ్‌ ఎస్‌.విజయలక్ష్మి, బెల్లాన త్రినాధ రావు,ఉప సర్పంచ్‌ మండల సురేష్‌ ,రేగ సురేష్‌, ఎస్‌ఎంసి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ సిహెచ్‌ సోమావతి, కడగల రామచంద్రరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️