విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

Jan 26,2024 21:51
ఫొటో : ట్యాబ్‌లు అందజేస్తున్న హెచ్‌ఎం శ్రీనివాసులు

ఫొటో : ట్యాబ్‌లు అందజేస్తున్న హెచ్‌ఎం శ్రీనివాసులు
విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని నందవరం జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 8వ తరగతి విద్యార్థులకు వైసిపి నాయకులు రామ్మోహన్‌ శుక్రవారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, పౌరులందరూ మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు ఒంటెద్దు కృష్ణారెడ్డి, ఖాదర్‌ బాషా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️