సిపిఎం సభ్యులు పాలపర్తి సుబ్బారావు మృతి

Jun 24,2024 21:58

భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు.. ఇన్‌సెట్‌లో మృతుడు పాలపర్తి సుబ్బారావు (ఫైల్‌)
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
పట్టణంలోని మదర్‌ థెరిస్సా కాలనీకి చెందిన సిపిఎం సభ్యులు పాలపర్తి సుబ్బారావు (72) అనారోగ్యంతో సోమవారం ఉదయం 11 గంటలకు మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. సుబ్బారావు భౌతికకాయాన్ని సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, నాయకులు ఎస్‌.లూథర్‌ సందర్శించి సిపిఎం జెండాను కప్పి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రిక్షా యూనియన్‌లో 30 ఏళ్లుగా పని చేస్తున్న సుబ్బారావు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. సిపిఎం సభ్యులుగా తుది శ్వాస విడిచే వరకూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేశారని అన్నారు. నివాళులర్పించిన వారిలో ఎస్‌.బాబు, బి.కోటానాయక్‌, సత్యం, పి.శ్రీనివాసరావు ఉన్నారు.

➡️