విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Feb 16,2024 21:21

ప్రజాశక్తి – కురుపాం : పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని జిల్లా విద్యాశాఖ ఎడి పి.దామోదరరావు సూచించారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత గురయ్యారని ‘ప్రజాశక్తి’ ప్రచురితమైన వార్తకు స్పందించి శుక్రవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు పెట్టె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనాలు బాగోలేక కొందరు విద్యార్థులు అస్వస్థత గురైన సంఘటనకు గల కారణాలను ప్రిన్సిపల్‌ వి.రామలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఇకపై విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనాలు వండిపెట్టెలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్టాక్‌ రూంను పరిశీలించి, పాడైన చోడి పిండి ప్యాకెట్లును తిరిగి పంపించాలన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం జిల్లా కోఆర్డినేటర్‌ జి.శివున్నాయుడు, యు.నాగేశ్వరరావు, ఎంఇఒ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️