విద్యార్థులకు యూనిఫాం, రూ.50 వేల నగదు వితరణ

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

పట్టణంలోని శ్రీసత్యసాయి బాలభారతి విద్యాలయంలోని విద్యార్థులకు సోమవారం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ నూజివీడు వారి ఆధ్వర్యంలో రోటరీ జిల్లా గవర్నర్‌ రావూరి సుబ్బారావు 100 మంది విద్యార్థులకు యూనిఫాం, రూ.50 వేల నగదు వితరణగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ అధ్యక్షులు గొల్లపూడి రవిబాబు, కార్యదర్శి పిడి.వెంకటరత్నం పాల్గొన్నారు.

➡️