విద్యార్థులను శాస్త్రవేత్తలుగా చేయడమే లక్ష్యం

రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సిఎం ప్రజాశక్తి – కడప భవిష్యత్‌లో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆకాక్షించారు. గురువారం స్థానిక మరియాపురం సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రితోపాటు జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఎస్‌సిఇఆర్‌టి ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ను కడప నగరంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషమని అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక సైన్స్‌ ఫెయిర్‌ ఏర్పాటు చేయడమంటే పాఠశాలల్లో, నగరంలో ఒక పండగ వాతావరణంగా ఉండేదని అన్నారు. అలాంటిది ఈ రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ ప్రదర్శన కడప నగరంలో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. పెద్ద సంఖ్యలో రాష్ట్రస్థాయి సైన్స్‌ వేర్‌ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు హాజరు కావరడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌ తరాలన్నీ సైన్సు పైనే ఆధారపడి ఉన్నాయని, పూర్వ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని ఈ ప్రదర్శనకు వచ్చిన విద్యార్థుల ఆవిష్కరణలను అభినందించాలని చెప్పారు. సివి రామన్‌, ఎపిజె అబ్దుల్‌ కలాం వంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం ముం దుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ రాబోవు రోజుల్లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ కడప నగరంలో నిర్వహిం చడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, విద్యార్థులు తమ విద్యలో సాధన చేస్తూ సజనాత్మక ఆలోచన విధానం పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారం భించారు. అనంతరం అతిథులు సైన్స్‌ ఫెయిర్‌ ప్రదర్శన గదులను రిబ్బన్‌ కత్తిరించి ప్రార ంభించారు. ప్రదర్శనలో ఉంచిన ప్రదర్శనలపై విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి మహేశ్వర రెడ్డి, రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌస్‌ లాజం, రాష్ట్ర ఉద్యాన శాఖ రహదారులు సంబటూరు ప్రసాద్‌ రెడ్డి, ఎంఇఒ నారాయణ, ఇతర అధికారులు, కార్పొరేటర్‌ షేక్‌ మొహమ్మద్‌ షఫీ, నాయకులు నారపరెడ్డి సుబ్బారెడ్డి అహమ్మద్‌, ఎల్లారెడ్డి, ఉపాధ్యాయులు, 26 జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️