విద్యార్థులపై శ్రద్ద చూపాలి

Jan 4,2024 21:44

ప్రజాశక్తి – రామభద్రపురం : డి గ్రేడ్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపి ఏ గ్రేడ్‌లో నిలిపేందుకు ఉపాద్యాయులు కృషి చేయాలని ఉప విద్యా శాఖాధి కారి బ్రహ్మాజీరావు ఆదేశించారు. ఆరికతోట జెడ్పీ హైస్కూల్లో గురువారం సంవత్సరాంత తనిఖీల్లో భాగంగా విచ్చేసిన ఆయన స్కూల్లో వివిధ రికార్డులు, స్కూల్‌ పరిసరాలు, విద్యార్థులకు సంబందించిన అన్ని ధృవ పత్రాలు పరిశీలించారు. మాక్‌ డ్రిల్‌, యోగా వివిధ క్రీడలపై ఇస్తున్న తర్ఫీదు స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించి వారిలో ఉన్న సృజనాత్మకత వెలికి తీసేలా నూతన రీతిలో బోధనా పద్ధతులు అవలంబించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసి మెనూ ప్రకారం రుచిగా, వేడిగా ఆహార పదార్థాలు అందివ్వా లన్నారు. భోజనాలు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ తనిఖీలు సంతృప్తి కరంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ తిరుమల ప్రసాద్‌, హెచ్‌.ఎం ప్రసాదరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️