విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : బూచేపల్లి

ప్రజాశక్తి- దర్శి : విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయుడు ఖాదర్‌ భాషా అధ్యక్షతన బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో భాగా చదివి రాణించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో ఎదిగి ఉన్నతంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఉన్నత విద్యకోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద లాంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు కాకర్ల రఘురామయ్య, బి.రమాదేవి. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️