విద్యార్థులు కష్టపడితే ఉన్నత శిఖరాలకు..

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్న శిఖరాలకు చేరుకోవచ్చని సినీ హీరో, బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు తెలిపారు. ఏడుగుండ్లపాడులోని శ్రీహర్షిణి జూనియర్‌ కళాశాల వార్షికోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు. హర్షిణి విద్యాసంస్థల చైర్మన్‌ గోరంట్ల రవికుమార్‌ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ బాలుర క్యాంపస్‌ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 1000 మంది విద్యార్థులు చేరినందుకు తల్లిదండ్రులకు కతజ్ఞతలు తెలిపారు. అనంతరం పరీక్షలలో ఉత్తమ ప్రతిభకనపరచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ గోరంట్ల కవిత, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్స్‌ కరణం నారాయణ, దివి రమేష్‌, ఎఒ శేఖర్‌ బాబు, జిఎం శివరాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డి. ఆంజనేయులు, వైస్‌ ప్రిన్సిపల్‌ వీరేశలింగం, ఎఒ ర్యాంకర్‌ శ్రీనివాసరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️