విద్యుత్‌ శాఖ అధికారుల దాడులు

ప్రజాశక్తి-టంగుటూరు : ఒంగోలు డివిజన్‌ పరిధిలోని టంగుటూరు రూరల్‌ సెక్షన్‌లో విద్యుత్‌ అధికారులు దాడులు సోమవారం నిర్వహించారు. విద్యుత్‌ శాఖ అధికారులు 27 బందాలుగా ఏర్పడి 2200 విద్యుత్‌ సర్వీస్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు లోడు వినియోగిస్తున్న 136 సర్వీస్‌ లను గుర్తించి రూ 2.97 లక్షల జరిమానా విధించారు. మీటర్‌ లేకుండా విద్యుత్‌ చౌర్యానికి ప్పాలడుతున్న ఓ వ్యక్తిని గుర్తించి రూ.1, 500 జరిమానా విధించారు. మాల్‌ ప్రాక్టీస్‌ కు పాల్పడుతున్న మరో వ్యక్తికి రూ.3, 500 అపరాధ రుసుం విధించారు. అనధికారికంగా విద్యుత్తును వినియోగించినా, లేదా మాల్‌ ప్రాక్టీస్‌ కు పాల్పడినా సదరు వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్‌ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పి శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ దాడులలో విద్యుత్‌ శాఖ విజిలెన్స్‌ ఇఇ శ్రీనివాసరావు, డిఇఇ మోహన్‌ రావు, వినరు కుమార్‌ రెడ్డి, టంగుటూరు రూరల్‌ ఎఇ చంద్రశేఖర రావు, ఎఇలు , సిబ్బంది పాల్గొన్నారు.

➡️