విద్యుత్‌ సంస్థలో విలీనం చేయాలి

Feb 5,2024 22:02
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
విద్యుత్‌ సంస్థలో విలీనం చేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు : విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం ‘స్పందన’లో కలెక్టర్‌ను యూనియన్‌ నాయకుల ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు కలిసి తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో యూనియన్‌ నాయకులు మాట్లాడు తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యునైటెడ్‌ ఎలక్ట్రిసీ ఎంప్లాయిస్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల, కాంట్రాక్టు వర్కర్స్‌ ప్రధాన సమస్యలు అయిన కార్మికులను అందరిని సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్‌ చేయాలని కోరారు. సంస్థలో వాచ్‌ మెన్స్‌ గా చేస్తూ షిఫ్ట్‌ ఆపరేటర్‌ అయిన నూతనంగా చేరిన షిఫ్ట్‌ ఆపరేటర్లు కు పాత అపరేటర్లతో సమానంగా వేతనాలు చెలించాలి, మీటర్‌ రీడర్స్‌ కు కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ,పిసురేటు కార్మికులు అయిన బిల్‌ కలెక్షన్‌ ఏజంట్లకు, ఎస్‌పిఎం కార్మికులకు,స్టార్‌ హమాలిస్‌ కు కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ నెల 8 వ తేదీన విద్యుత్‌ భవన్‌ వద్ద జరిగే నిరసన ధర్నా కార్యక్రమాలకు ప్రతి కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.యుఈఈయు జిల్లా కోశాధికారి పెంచాల ప్రసాద్‌, నగర అధ్యక్షులు హరినారాయన, జిల్లా నాయకులు లక్ష్మీ పతి,నజీర్‌,కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ సుమన్‌, నగర డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఆరిఫ్‌,జెన్‌ కో ప్రధాన కార్యదర్శి భాస్కర్‌,జిల్లా నేతలు సునీల్‌,భాస్కర్‌ ఉన్నారు.

➡️