విధుల నుంచి వాలంటీర్‌ తొలగింపు

ప్రజాశక్తి-పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలంలోని నరజాముల తండాలో వాలంటీర్‌గా పనిచేస్తున్న రామావత్‌ వెంకటేశ్వర్లు నాయక్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపిడిఓ విలియమ్స్‌ శుక్రవారం తెలిపారు. రామావత్‌ వెంకటేశ్వర్లు నాయక్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీలో కొంతమంది నాయకుల ను చేర్పించే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని తెలిపారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో విచారించగా నిజమని తేలడంతో వెంకటేశ్వర్లు నాయక్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఆయన చెప్పారు.

➡️