వెయిట్‌ లిఫ్టింగ్‌లో కొండవెలగాడ ప్రతిభ

Feb 9,2024 20:37

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : అఖిల భారత మహిళా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కొండవెలగాడ మహిళా వెయిట్‌ లిఫ్టర్లు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం ధర్మశాలలో ఈ నెల 7 నుంచి 9 వరకు ఆలిండియా ఇంటర్‌ జోనల్‌ ఉమెన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. కొండవెలగాడకు చెందిన ఎస్‌.పల్లవి 64 కిలోల విభాగంలో స్నాచ్‌ 80, క్లీన్‌ జర్క్‌ 100 మొత్తం 180 కిలోల బరువెత్తి బంగారు పతకం సాధించింది. సిహెచ్‌ శ్రీలక్ష్మి 81 కిలోల విభాగంలో స్నాచ్‌ 83, క్లీన్‌ జర్క్‌ 102 మొత్తం 185 కిలోలు బరువెత్తి రజత పతకం కైవశం చేసుకుంది. బి.రాజేశ్వరి 45 కిలోల విభాగంలో స్నాచ్‌ 60, క్లీన్‌ జర్క్‌ 80 మొత్తం 140 కిలోల బరువెత్తి కాంస్య పతకం సాధించింది. వీరిని జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి.లక్ష్మీనాగనరేంద్ర, సెక్రటరీ చల్లా రాము, అసోసియేషన్‌ సభ్యులు అభినందించారు.

➡️