వేగంగా గృహాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

Feb 10,2024 22:06

వేగంగా గృహాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరపాలక పరిధిలో ఇంటి స్థలాలు, గృహాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. నగరపాలక పరిధిలో వార్డు సచివాలయాల్లో జరుగుతున్న పేదలందరికీ ఇల్లు.. గహాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కమిషనర్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాంబయ్య కండిగ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. వార్డు కార్యదర్శులకు మార్గనిర్దేశం చేశారు. లబ్ధిదారులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా చేయాలన్నారు. లేఅవుట్లు, లబ్ధిదారుల వివరాలను సరిచూసుకొని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇంటిస్థలాలు, గహాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మరో మూడు రోజులే సమయం ఉన్నందున వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. వార్డు సచివాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలను సంబంధిత సూపర్వైజర్‌ అధికారులు, హౌసింగ్‌ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారులను సమన్వయం చేసుకొని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. కమిషనర్‌ వెంట ఆర్వో గోపాలకష్ణ వర్మ, హౌసింగ్‌ ఏఈ శ్రీధర్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ లోకనాథం ఉన్నారు.

➡️