వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ఉద్యోగులు మృతి

Jan 23,2024 20:50

ప్రజాశక్తి – నెల్లిమర్ల : విద్యుత్‌ ఘాతంతో జూనియర్‌ లైన్‌ మెన్‌ మృతి చెందారు. మంగళవారం స్థానికులు అందించిన వివరాల ప్రకారం గుషిని సచివాలయంలో జూనియర్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న రెడ్డి కోటారావు (27) విద్యుత్‌ స్తంభం మీద కొత్త ట్రాన్స్‌ ఫార్మర్‌ లైన్‌ కలుపుతుండగా హెచ్‌టి లైన్‌ తీగలు తగలడంతో షాక్‌తో కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎఇ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జామిలో విషాద ఛాయలుజామి: జామి గ్రామానికి చెందిన రెడ్డి కొటారావు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. జామి కొత్తల వీధికి చెందిన సన్యసప్పడు, కృష్ణమ్మ దంపతులకు ఏకైక సంతానంగా పుట్టిన కోటారావు గుషిణిలో విద్యుత్తు షాక్‌తో మృతి చెందాడు. మృతదేహాన్ని పంచనామా చేసిన అనంతరం స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుమారుడు శవమై రావడంతో ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటుతున్నాయి. బస్సు ఢకొీని ఎఇఒ వంగర: విధులు ముగించుకొని బైక్‌ పై సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్‌టిసి బస్సు ఢకొీనడంతో వ్యవసాయ విస్తీర్ణ అధికారి ( ఎఇఒ) గొర్లె సత్యనారాయణ ( 35) మృతి చెందారు. ఈ ఘటన రాజాం పట్టణం బొబ్బిలి సెంటర్లో మంగళవారం జరిగింది. దీంతో మృతుడి స్వగ్రామం వంగర మండలం ఎం సీతారాంపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన రాజాం మండలంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారిగా పనిచేస్తున్నాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఇందిర వంగర మండలంలోని మద్దివలస సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. వీరికి మూడు, ఆరు సంవత్సరాల గల ఇద్దరు ఆడపిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️