వేసవి తాపానికి ఆయుర్వేద చిట్కాలు

Apr 1,2024 21:11

ప్రజాశక్తి – సీతానగరం: వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ఆయుర్వేదంతో మంచి ఉపశమనం కలుగుతుం దని బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్‌ టి.హేమాక్షి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత వేసవి తరుణంలో బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోని యెడల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, శరీరం నీటి శాతాన్ని కోల్పోతుందని అన్నారు. వీటికి గురికాకుండా ఉండేందుకు ఆయుర్వేద ఔషధాలు ఇంటి వద్ద చేసుకోగలిగేఉపశమనాన్ని పొందవ చ్చునని తెలిపారు. – సబ్జాగింజలు నానబెట్టి, నిమ్మరసం కలిపి అందులో కొంచెం కండ శర్కర వేసి తాగాలి.- మజ్జిగలో జీలకర్ర పొడి చిటికెడు, కొంచం బ్లాక్‌ ఉప్పు కలిపి తీసుకోవాలి.- వట్టివేరు(ఉశీర)పొడిచేసి అందులో కొద్దిగా దనియాల పొడి కలిపి కషాయం కాచి, – కండశర్కర కలిపి తాగాలి. – శతావరి (పిల్లి పీచర) వేర్లు పొడి పాలలో కలిపి తీసుకోవచ్చు.- అతి మధురం అర చెంచా ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి. మధు మేహం ఉన్నవారు బెల్లం కాని, తాటి బెల్లం కాని ఉపయోగించవచ్చు.- ఉసిరిక పౌడర్‌లో గుంటగలగర ఆకు, పెరుగు కలిపి తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. – దోసకాయ రసం ముఖం, చర్మంపై పూతగా వేసుకున్న ఎండకి పొడి బారకుండా ఉంటుంది. ఆహారం విషయానికి వస్తే ఈ వేసవిలో ఎక్కువగా శాఖాహారం తీసుకోవాలని సూచిం చారు. తాజా ఆకుకూరలు, కీర దోస, పుచ్చకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలన్నారు. వేపుడు పదార్థాలు, నూనె వంటలు బాగా తగ్గించుకోవాలి. పిల్లలను బయట ఫాస్ట్‌ ఫుడ్స్‌,చిరు తినుబండారాలకు సాధ్యమై నంత దూరంగా ఉంచాలని హితవు పలికారు. కాటన్‌, లేత రంగు, తేలిక పాటి దుస్తులు ధరించా లన్నారు. ఆసుపత్రిలో ఆయుర్వేద ఔషధాలు చందనాసవ, ఉశీరాసవ, ధాన్య పంచక కషా యం, షడంగ పానీయం మొదలగునవి వేసవి తాపానికి ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వైద్యుల సూచ నలు పాటిస్తూ ఎండ తీవ్రతకు గురికా కుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు.

➡️