‘వైఎస్‌ఆర్‌ పింఛను కానుక’ ఒక మైలురాయి

కాకినాడలబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

నవరత్నాల కార్యక్రమాలలో వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పథకం ఒక మైలురాయి అని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల బహిరంగ సభ నుండి పెంచిన పింఛన్‌ నిధులను సిఎం జగన్‌ టన్‌ నొక్కి లబ్ధిదారులు ఖాతాల్లో వర్చువల్‌ విధానంలో జమ చేశారన్నారు ఈ వర్చువల్‌ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక పథకం సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలను ఆదుకోవడానికి ఉద్దేశిం పబడిందన్నారు. పేదరిక వర్గాలలో వద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళ వితంతువులు చేనేత కల్లుగీత కార్మికులు మత్స్య కారులు చర్మకారులు, చేతి వత్తు లువారికి సామాజిక భద్రత, సురక్షితమైన గౌరవప్రదమైన జీవనాన్ని అందించే ఉద్దేశ్యంతో పింఛను దశల వారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్‌ పెన్షన్‌ కనుక పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుంచి 2,48,514 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. రూ.72,38,64,000 చెల్లిస్తుండగా జనవరి నెల నుంచి ఈ పెంపుదల మూలంగా రూ.5.92 కోట్లు మేర లబ్ది చేకూరుతుందన్నారు.ఈ మెగా చెక్కును జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదేవిధంగా లబ్ధిదారులకు పెంచిన రూ.3వేల పెన్షన్‌ జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈనెల ఒకటో తేదీ నుంచి వైఎస్‌ఆర్‌ పింఛను కానుక రూ.3 వేలకు పెంపు, 8వతేదీ వరకు పండుగలా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. .ఈ కార్యక్రమంలో వక్ప్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షు లు పికె.రావు, జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ పథక సంచాలకులు వి.శివశంకర్‌ ప్రసాద్‌, ఎపి డిఎం ఎం.జిలాని, డిపిఎం విజరు కుమార్‌, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️