వైకల్యంపై ఆత్మవిశ్వాసం గెలుస్తుంది : ‘గడికోట’

ప్రజాశక్తి-రాయచోటి విభిన్నప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణంలో రాయచోటి నియోజకవర్గంలోని విభిన్నప్రతిభావంతులకు బ్యాటరీ ట్రై సైకిల్స్‌, వినికిడి యంత్రాలను శ్రీకాంత్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రెండు విడుదలుగా విభిన్నప్రతిభావంతులకు వారికి అవసరమైన పరికరాలు అందజేశామని పేర్కొన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అలిమ్‌ కో-సంస్థతో మాట్లాడి అర్హత ఉన్న వారందరికీ పరికరాలు ఇప్పించడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు వికలాంగుల స్థితిగతులు చెప్పినప్పుడు ఏదో రకంగా వీరికి సహాయం చేయాలనే ఆలోచనతో నేడు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.కాళ్లు లేని వారికి, మాటలు వినపడని వారికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనస్సుకు ఎంతో సంతోషం కలుగు తుందన్నారు. ప్రభుత్వం మానవత్వంతో చేస్తున్న ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత, నైపుణ్యం ఉంటుందని, దివ్యాంగులలో ఎంతో నైపుణ్యం గలవారు ఉన్నారని వీరందరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష సాధన దిశగా ముందుకు వెళితే అనుకున్నది సాధించవచ్చునన్నారు.రాష్ట్ర ప్రభు త్వం విభిన్నప్రతిభావంతుల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని ఎన్నో కార్యక్ర మాలు అమలు చేస్తుందని అర్హులందరూ ప్రభుత్వ పథకాలు సద్విని యోగం చేసుకోవాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష క షి చేస్తుందని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాయచోటి నియోజకవర్గంలో 613 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.1,03,97,155 విలువ చేసే పరికరాలు అందజేశామన్నారు. ప్రభుత్వం విలువైన పరికరాలు ఉచితంగా అందజేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత ఉన్నవారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారందరికీ అర్హత మేరకు పరికరాలు ఇచ్చామని చెప్పారు. కార్యక్ర మంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, జడ్‌పిటిసి వెంకటేశ్వరరెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణకిషోర్‌, పాల్గొన్నారు.

➡️