వైపాలెంను అభివృద్ధి చేస్తా: ఎరిక్షన్‌బాబు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: మీ అందరి సహకారంతో యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని యర్రగొండపాలెం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆదివారం యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి హైదరాబాదు వెళ్లి ఉద్యోగ రీత్యా హైదరా బాదులో నివాసం ఉంటున్న వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని మీరంతా వచ్చి టిడిపిని గెలిపించేందుకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా టిడిపి నాయకులు జీవీ రెడ్డి, పొడపాటి తేజస్వి, తిరునగరి జ్యోత్స్న, రాయపాటి అరుణ, నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పాకనాటి గౌతమ్‌ రాజ్‌, ఎనుముల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియో జకవర్గం నుంచి హైదరాబాదులో ఉంటూ వివిధ రకాల ఉద్యోగాలు చేసుకుంటున్న 2,500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️