వైభవంగా ఖాదర్‌ వలి ఉరుసు మహోత్సవం

Feb 21,2024 20:49

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : హజరత్‌ సయ్యద్‌ షహిన్‌ షా బాబా ఖాదర్‌ వలి 65వ మహా సూఫీ సుగంధ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. దేశ సమైక్యత ఫరిడవిల్లేలా కుల, మత, ప్రాంత, ధనిక, పేద తారతమ్యత లేకుండా దేశ నలు మూలల నుంచి తరలి వచ్చిన అశేష జనంతో బాబామెట్ట ఖాదర్‌ బాబా దర్గా, దర్బార్‌ కిక్కిరిసిపోయింది. ఖాదర్‌ బాబా ప్రియ శిష్యులు హజరత్‌ అతావుల్లా షరీఫ్‌ షా తాజ్‌ ఖాదర్‌ బాబా సూఫీ ఆధ్యాత్మిక వారసులైన చీమల పాడు సూఫీ పీఠాధిపతి మొహమ్ముద్‌ ఖ్వాజా మోహియునుద్దీన్‌ షా తాజ్‌ ఖాదరి, విజయనగరం దర్గా, దర్బార్‌ షరీఫ్‌ ముతవల్లి డాక్టర్‌ మొహమ్మద్‌ ఖలీలుల్లా షరీఫ్‌షా తాజ్‌ ఖాదరీ ఆధ్వర్యాన ఖాదర్‌ బాబా చిత్ర పటాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి నగరంలో భారీ ఊరేగింపుగా వెళ్లి భక్తులకు ఆశీస్సులు అందించారు. అనంతరం దర్గాలోని బాబా సమాధికి సుగంధం చాదర్‌, పూలు సమర్పించారు. లంగర్‌ ఖానాలో భారీ అన్న సమారాధన అర్దరాత్రి వరకు నిర్వహించారు.

➡️