వైసిపి అభ్యర్థులు వీరే

ప్రజాశక్తి – కడప ప్రతినిధి వైసిపి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర సీనియర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌లు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, అనకాపల్లి మినహా మిగిలిన 24 పార్లమెంటు టికెట్లను ప్రకటించారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజంపేట, మదనపల్లె మినహా మిగిలిన అభ్యర్థులందరూ సిట్టింగు ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించారు. కడప, రాజంపేట పార్లమెంట్‌ టికెట్లు సైతం సిట్టింగు ఎంపీలైన వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డికి కేటాయించారు. జిల్లాలోని కడప అసెంబ్లీ టికెట్‌ డిప్యూటీ సిఎం ఎస్‌బి అంజాద్‌బాషా, కమలాపురం పోచిమారెడ్డి రవీంద్రనాధరెడ్డి, మైదుకూరు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరుకు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, జమ్మలమడుగుకు మూలే సుధీర్‌రెడ్డి, పులివెందుల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, బద్వేల్‌ టికెట్‌ డాక్టర్‌ దాసరి సుధకు లభించింది. అన్నమయ్య జిల్లాలో రాయచోటి అసెంబ్లీకి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు కొరముట్ల శ్రీనివా సులు, మదనపల్లికి నిస్సార్‌ అహ్మద్‌, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, తంబళ్ల పల్లి పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డికి టికెట్లు లభించాయి. రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి టికెట్‌ను జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఆకేపాటి అమర నాధరెడ్డికి టికెట్‌ లభించడం విశేషం. అధికార వైసిపి 12 విడతలుగా సమన్వ య కర్తలను నియమించింది. కడప, అన్నమయ్య జిల్లాకు చెందిన 13 మందిలో 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించకపో వడంతోఊహాగానాలు చోటుచే 0.2bసుకున్న సంగతి తెలిసిందే. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు స్థానాలను మార్చు తున్నట్లు, వైఎస్‌ కుటుంబీకులు పోటీ చేయనున్నట్లు సాగిన ఊహాగానాలకు చెక్‌ పెట్టినట్లు అయింది. తాజాగా అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల టికెట్ల పట్ల స్పష్టత లభించడం, ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో అధికార వైసిపికి చెందిన సిట్టింగు ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రోరు పతాకస్థాయి చేరుకోనుంది. ఇప్పటివరకు ప్రతిపక్ష టిడిపి కడప జిల్లా టిడిపి అభ్యర్థులను దశల వారీగా ప్రకటిస్తూ పోయిన సంగతి తెలిసిందే. టిడిపి అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా సాగిస్తుండడంతో అధికార వైసిపి అభ్యర్థులు మిన్నకు ండిపోయారు. తాజా రాష్ట్రవ్యాప్త టికెట్ల ప్రకటనతో ఎన్నికల సమరాంగణం పూర్తిస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

➡️