వైసిపి అరాచక పాలనకు స్వస్తి

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన ఎన్నికల నోటిఫికేషన్‌తో ముగిసిందని జమ్మలమడుగు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చదిపిరాల భూపేష్‌ సుబ్బరామిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాల యంలో ఆయన విలేకరు లతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వచ్చిందన్నారు. ఇప్పట ినుంచైనా అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు. ఈ సంధి కాలంలో అధికారుల పనితీరు ప్రజలకు, పార్టీలకు అద్దం పట్టేలా ఉండాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో నేటితో వైసిపి పాలనకు చరమగీతం పాడుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులోని పార్టీలతో కలిపి విజయ దుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాక్షస పాలన ముగిసి ప్రజా ఆమోదయోగ్యమైన పాలన జూన్‌ నుండి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలకు మంచి జరిగే అవకాశాన్ని మే 13న ఓటర్లు ఎంచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన కో-ఆర్డినేటర్లు నల్లంశెట్టి నాగార్జున, డేరంగుల జగదీష్‌, టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

➡️