వైసిపి ఎస్‌సి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ‘మంచికల’

ప్రజాశక్తి-కొనకనమిట్ల: వైసిపి ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించటం పట్ల కొనకనమిట్ల మండలం గనివెనపాడు గ్రామస్తుడు, వాగుమడుగు మాజీ ఎంపీటీసీ మంచికల చిన్నకోటేశ్వరావు ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో తన సేవలను గుర్తించి, తన మీద ఎంతో నమ్మకంతో తనకు ఈ పదవి రావడానికి విశేష కృషి చేసిన ఏపీఐఐసీ చైర్మన్‌, పార్టీ జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పొల్యూషన్‌ బోర్డ్‌ మెంబర్‌ వెన్నహనుమారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.

➡️