వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపు దామని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో పట్టణంలోని 23, 24, 25, 26, 27 బూత్‌ల క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, ముఖ్య నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో దోపిడీ, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. అభివద్ధి శూన్యంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, షేక్‌ మస్తాన్‌వలి, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, కొత్తమాసు సుబ్రమణ్యం, షేక్‌ వలి, తోటా మహేష్‌ నాయుడు, వెంకట్రావు గౌడ్‌, షేక్‌ ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️