వైసిపి యుద్ధానికి టిడిపి సంసిద్ధం- పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి

ప్రజాశక్తి-కడప అర్బన్‌ వైసిపి ఎన్నికల యుద్ధానికి టిడిపి సంసిద్ధమని టిడిపి రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, నియో జకవర్గ అభ్యర్థి మాధవి పేర్కొ న్నారు. బుధవారం ద్వారకా నగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసిపి నాయకులు 10 వాహనాల్లో ప్రచారానికి వెళ్తున్నా ఎన్నికల కోడ్‌ లేదని, టిడిపి నాయకులకు మాత్రం ఓట్లు అడిగేందుకు ఎన్నికల నిబంధనలా అని ప్రశ్నించారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాకు అన్యాయం చేశారని, కడప వాసిగా డిప్యూటీ సిఎం నీటి సమస్యను తీర్చలేకపోయారని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివద్ధి చంద్రబాబుతోనే సాధ్యమ న్నారు. మసీదు నుంచి బయటికి వచ్చిన యువకున్ని బ్లేడుతో గాయపరిస్తే, ఆసుపత్రిలో ఉన్న యువకున్ని దాడికి ప్రోత్సహించిన వారే పరామర్శిం చడం ఎంతటి నయవంచనన్నారు. నీటి సమస్య మరింత జటిలంగా మారనుందని, కలెక్టర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ నివారించాలన్నారు.

➡️