వ్యాపారస్తులకు టిడిపి అండ..

Jan 8,2024 21:34
కరపత్రాలు పంపిణీ చేస్తున్న నారాయణ

కరపత్రాలు పంపిణీ చేస్తున్న నారాయణ
వ్యాపారస్తులకు టిడిపి అండ..
ప్రజాశక్తి నెల్లూరు సిటీ: వ్యాపారాస్తులు బాగుంటేనే…ప్రభుత్వాలు బాగుంటాయని…అప్పుడే అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతాయని వారికి అండగా టిడిపి ఉంటుందని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరం 44,46,47 డివిజన్లలో బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి సోమవారం ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ .. ఈ డివిజన్లలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ సారి ఖచ్చితంగా మీకే ఓటు వేస్తామని ఘంటా పదంగా చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా ఉంటూ…ఎవరి పనులు చేసుకునే ప్రశాంతమైన వాతావరణాన్నే వ్యాపారస్తులు కోరుకుంటారన్నారు. వ్యాపారాలు బాగా ఉండి…వారి ఆదాయాలు బాగా పెరిగితేనే… పరిపాలకులు రాష్ట్రాన్ని పరిపాలించగలరని…లేకపోతే సక్రమంగా పరిపాలించలేరన్నారు.వ్యాపారాస్తుల ద్వారా జీఎస్టీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ లు వస్తేనే…రాష్ట్రాన్ని అభివద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ… చిన్నబజారు, పెద్ద బజారు..కాదు…ఎక్కడకెళ్లినా..ఈ సారి మీరే సార్‌ అన్న పధం ఒక్కటే వినిపిస్తుందన్నారు. నెల్లూరు నగరాన్ని 90 శాతం అభివద్ధి చేసింది నారాయణేనన్న విషయం ప్రజలందరికి తెలుసునన్నారు. అధికారంలోకి రాగానే…పెండింగ్‌ పనులను పూర్తి చేయడంతోపాటు… నెల్లూరు నగరాన్ని మరో చెన్నరు సిటీగా అభివద్ధి చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో దొంగ ఓట్లతో నువ్వు గెలిచావని…లేకపోతే నారాయణే గెలిచేవారని ఎమ్మెల్యే అనిల్‌ పై సెటైర్లు వేశారు. అందుకనే ఈ సారి దొంగ ఓట్లపై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. చిన్న కార్యకర్తను కూడా రూ. 10 లక్షలతో కొంటున్నావని ఆరోపించారు. 2024లో నిన్ను చెన్నైకి పంపడం ఖాయమన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు , గుడి ఏడుకొండలు, మహేంద్ర , మణి,దశరథ రామిరె, సత్య నాగేశ్వరరావు, గణేష్‌, ్జ రెహమాన్‌, రాజా,భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️