శంఖారావంతో వైసిపిలో వణుకు : మాజీ మంత్రి కోండ్రు

Feb 11,2024 20:08

 ప్రజాశక్తి-రాజాం :  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం సభలతో వైసిపిలో వణుకు పుడుతోందని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోండ్రు మురళీ అన్నారు. ఈనెల 15న రాజాంలో నిర్వహించనున్న శంఖారావం సభ నేపథ్యంలో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఎన్నికల శంఖారావమని కోండ్రు అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జాబ్‌ క్యాలెండర్‌ లేదని, ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని తెలిపారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఐటి ఉద్యోగాలు, టీచర్‌ ఉద్యోగాలిచ్చామన్నారు. నాసి రకం మద్యంతో వేలాదిమంది ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. టిడిపి, వైసిపికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటిపన్ను, విద్యుత్‌ ఛార్జీలు, ఆఖరికి చెత్త పన్ను పెంచిన వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈనేపథ్యంలో నిర్వహించనున్న శంఖారావం సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుమల వెంకట మన్మధరావు, నంది సూర్య ప్రకాశరావు, నాగళ్ళ అప్పల నాయుడు, పిన్నింటి మోహన రావు, కిమిడి అశోక్‌ కుమార్‌, గట్టి భాను, గురవాన నారాయణ రావు, ఉరిటి సురేంద్ర, టంకాల కన్నం నాయుడు, శాసపు రమేష్‌ కుమార్‌, దుప్పలపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️