శాంతించిన ‘మిచౌంగ్‌’

Dec 6,2023 21:28
దగ్గరుండి విద్యుత్‌ పునరుద్ధరణ పనుల్లో సిఎండి

శాంతించిన ‘మిచౌంగ్‌’మరో రెండు రోజులు వర్షాలా..?బెంబేలెత్తుతున్న జిల్లా ప్రజానీకంచెరువులను తలపిస్తున్న కాలనీలు42,500 ఎకరాల్లో వరి పైరు నష్టంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, యంత్రాంగం ఎట్టకేలకు మిచౌంగ్‌ తుపాను శాంతించింది.. మంగళవారం అంతా మేఘావృతమై ఉన్న వాతావరణం, బుధవారం ‘చుర్రు’మనే ఎండతో ఆనందాన్ని కలిగించింది.. గత నాలుగు రోజులుగా వర్షాలతో బెంబేలెత్తిన జిల్లా ప్రజానీకం బుధవారం ఎండ రావడంతో ఊరట చెందారు.. పునరావాస కేంద్రాల నుంచి పేదలు ఇళ్లకు వెళ్లారు. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన కాలనీల్లో ప్రజలు వస్తువులన్నీ ఎండలో ఆరబెట్టుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. రెవెన్యూ, విద్యుత్‌ శాఖ సిబ్బంది వర్షంలోనూ మరమ్మతులు చేస్తూ రవాణాకు, విద్యుత్‌కు అంతరాయం లేకుండా శ్రమించారు. ఇతర జిల్లాల నుంచి అదనంగా సిబ్బందిని రప్పించి యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో మంగళవారం రాత్రికే అంధకారంలో ఉన్న గ్రామాల్లో వెలుగులు నిండాయి. ఇప్పటికే చెరువులను తలపిస్తున్న వరిపైరు పొలాలు ఇంకా వర్షం కొనసాగితే మాత్రం పూర్తిగా నష్టపోతామని రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో 42,500 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. దగ్గరుండి విద్యుత్‌ పునరుద్ధరణ పనుల్లో సిఎండి

➡️