శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే చర్యలు తప్పవు : ఎస్‌ఐ ఎన్‌.రాఘవేంద్రప్ప

Feb 20,2024 14:37 #Kurnool, #police

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉరవకొండ ఎస్సై ఎన్‌.రాఘవేంద్రప్ప పేర్కొన్నారు. ప్రజలతో స్నేహభావంతో మెలిగి సమస్యలు పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఉరవకొండ పట్టణంతోపాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాలలో అన్ని వర్గాల రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సమన్వయం చేసుకునేలా కృషి చేస్తామన్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో సమస్యలు ఎదురైనప్పుడు గొడవలకు దిగకుండా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకునేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

➡️