శాశ్వత భూహక్కు పట్టాల పంపిణీ

ప్రజాశక్తి- శృంగవరపుకోట : నియోజకవర్గంలో గల అసైన్డ్‌ భూములకు శాశ్వత భూహక్కు పట్టాలను గురువారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సాగు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ప్రామాణికంగా అర్హులకు పథకాలను అందిస్తున్నామని అందులో భాగంగానే నియోజకవర్గంలోని ఐదు మండలాలలో గల అసైన్డ్‌ భూములను 22 ఏ జాబితా నుండి తొలగించి లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం కింద సుమారు 336 ఎకరాల భుమిని 652 మంది లబ్ధిదారులకు పట్టా పాసుపుస్తకాలు, అడంగల్‌లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ వేచలపు చినరామునాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్‌ మూకల కస్తూరి, పంచాయతీరాజ్‌ జోనల్‌ ఇంచార్జ్‌ సత్యనారాయణ, ఎంపిపిలు దొగ్గ సత్యవంతుడు, నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసిలు నెక్కల శ్రీదేవి, తూర్పాటి వరలక్ష్మి, గొర్లె సరయు, శానపతి అప్పారావు, రాష్ట్ర ఫోక్‌ అండ్‌ కల్చరల్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, సిపిఎం వేపాడ మండల కార్యదర్శి చల్లా జగన్‌, వైసిపి మండల అద్యక్షులు మమ్ములూరి జగన్నాధం, మోపాడ కుమార్‌, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️