‘శుభ’కరమైన సేవలందించిన బన్సల్‌

సబ్‌ కలెక్టర్‌గా శుభం బన్సల్‌

ప్రజాశక్తి -రంపచోడవరం : రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా శుభం బన్సల్‌ విశేషమైన సేవలు అందించారని ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నేతలు కొనియాడారు. రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా పనిచేసి, తిరుపతి జెసిగా బదిలీపై వెళ్లిన శుభం బన్సల్‌ను స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రంపచోడవడం ఏజెన్సీ డివిజన్‌లోని ఏడుమండలాల తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది దుశ్శాలువా వేసి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎపి ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అల్లూరి జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.శ్రీమన్నారాయణ, సబ్‌కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి మడకం సావిత్రి, రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం, దేవీపట్నం తహసీల్దార్‌లు రాజు, చిన్నం శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, సత్య నారాయణ, అసోసియేషన్‌ యూనియన్‌ డివిజన్‌ కార్యదర్శి ఫయాజ్‌ బాషా (జిలాని) తదితరులు సబ్‌కలెక్టర్‌గా శుభం బన్సల్‌ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే దేవేంద్రుడు, సిసి అజీమ్‌, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

బదిలీ సబ్‌కలెక్టర్‌ బన్సల్‌ను సత్కరిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

➡️