షేక్‌ సాబ్జీ మృతికి నివాళి

Dec 15,2023 20:49

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అకాల మరణం పట్ల సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బడుగు బలహీన వర్గాలతో పాటు విద్యా రంగాలకు తీరని లోటన్నారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.రమణారావు, వై.మన్మధరావు, కోశాధికారి జివి రమణ, వి.ఇందిర, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసిరావు, యుటిఎఫ్‌ నాయకులు ఎస్‌ మురళీమోహన్‌, టి.మురళి తదితరులు ఉన్నారు.వీరఘట్టం: ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతికి యుటిఎఫ్‌ మండలశాఖ స్థానిక ఎంఆర్సి ఆవరణలో సంతాపం తెలిపింది. పోరాట మార్గం సరైన మార్గమని, మీరు చెప్పిన పోరాట మార్గంలో ప్రతి కార్యకర్త మీ ఆశయాలు సాధిస్తామని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఇఒ ఆనందరావు, యుటిఎఫ్‌ నాయకులు ఎం.పైడిరాజు, కురుమాన గోవిందరావు, కె.గౌరునాయుడు, బి.దుర్గాప్రసాద్‌, ఎస్‌.మహేష్‌, వి.శ్రీధర్‌, ఎ.చంద్రమోహన్‌, సిహెచ్‌ వాసు, ఎ.సురేష్‌, ఆర్‌.జగదీష్‌, ఎం.దుర్గారావు, ఎన్‌ సంపత్‌, తదితరులు పాల్గొన్నారు.సీతంపేట : షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదములో మృతి చెందడం పట్ల ఆదివాసీ మాతృ బహు భాషా ఉపాధ్యాయులు, ఏజెన్సీ అదిమ గిరిజన పిల్లలకు తీరని లోటని సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సవర డొంబు, పాంగి శ్రీను ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారి కొర్ర సర్బునాయుడు, మర్రి చిట్టిబాబు, సీదిరి మహేష్‌, తదితరులు ఉన్నారు.

➡️