సంక్రాంతి సందర్భంగా బాడ్మింటన్‌ టోర్నీ : సిఐ

Jan 10,2024 14:49 #East Godavari

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : కడియం పోలీసు స్టేషన్‌ వద్ద ఉన్న బ్యాడ్మింటన్‌ గ్రౌండ్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టోర్నీ నిర్వహించనున్నట్లు సిఐ పివిజి తిలక్‌ తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయత్రం 4 గంటల నుండి ప్రారంభమై 12 తేదీ సాయంత్రం వరకు రెండు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని సిఐ తిలక్‌ తెలిపారు. ఔత్సాహికులు పోలీసు స్టేషన్‌ వద్దకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని టోర్నీలో పాల్గొనాలని తెలిపారు.

➡️