సంక్షేమ పథకాలు జగనన్నకే సాధ్యం

Feb 12,2024 21:44
ఫొటో : ప్రజలకు అభివాదం చేస్తున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ఫొటో : ప్రజలకు అభివాదం చేస్తున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
సంక్షేమ పథకాలు జగనన్నకే సాధ్యం
ప్రజాశక్తి-జలదంకి : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నా.. ముఖ్యమంత్రి జగనన్నకే సాధ్యమని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త, ఎంఎల్‌ఎ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జమ్మలపాలెం గ్రామంలో సర్పంచ్‌ బుర్రి శ్రీవేణి, సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గ ఎంఎల్‌ఎగా అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కన్వీనర్‌ పాలవల్లి మాలకొండారెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటిగా నియోజకవర్గ స్థాయిలో జమ్మలపాలెం గ్రామంలోనే ప్రచార యాత్ర మొదలైందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేకపాటి రాజగోపాల్‌ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్‌రెడ్డి, దుత్తలూరు జెఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ జయసింహారెడ్డి, జెడ్‌పిటిసి శివలీలమ్మ, సచివాలయాల కన్వీనర్‌ తిప్పారెడ్డి ఇందిరమ్మ, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మదన్మోహన్‌ రెడ్డి, జిల్లా ప్రచార ప్రధాన కార్యదర్శి అంకెనపల్లి నరసింహారెడ్డి, జిల్లా ఎస్‌సిసెల్‌ జనరల్‌ సెక్రటరీ దామెర్ల దేవదాసు, జిల్లా రైతు విభాగ జనరల్‌ సెక్రటరీ రావి ప్రసాద్‌నాయుడు, కలిగిరి జెడ్‌పిటిసి పాలూరి మాల్యాద్రి రెడ్డి, వింజమూరు జెడ్‌పిటిసి గణపం బాలకృష్ణారెడ్డి, కన్వీనర్‌ కలిగిరి కన్వీనర్‌ కాటం రవీంద్రారెడ్డి, సర్పంచ్‌లు తమ్మినేని సతీష్‌ బాబు, బొడిమల్ల కృష్ణారెడ్డి, నాయకులు గుమ్మిడి రమేష్‌, చేజర్ల హరిబాబురెడ్డి, పసుపులేటి ప్రసాద్‌, కాకాని మహదేవయ్య, మండలంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️