సంతక రూపంలో మరింత మద్దతు

Jan 19,2024 01:07

దుగ్గిరాలలో సంతకాలు సేకరిస్తున్న అంగన్వాడీలు, నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీల నిరవధిక సమ్మె గురువారం 38వ రోజుకు చేరుకుంది. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.కుమార్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమ్మె పట్ల మొండి వైఖరి విడనాడి వేతనాలు, గ్రాట్యుటీ వంటి ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి, సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పుకుంటూ అంగన్‌వాడీలు నెలరోజులకుపైగా రోడ్లపైకొచ్చి పోరాడుతుంటే సమస్యలు పరిష్కరించకపోగా నిర్బంధం విధించటం సరికాదన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్లు రూ.11500, ఆయాలకు రూ.7 వేల వేతనం ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు. సలహాదారులకు రూ.లక్షల వేతనాలిస్తూ స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయట్లేదని విమర్శించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు)నగర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాస్‌, నగర అధ్యక్ష, కార్యదర్శులు చినవెంకాయమ్మ, టి.రాధ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : సమ్మె శిబిరంలో అంగన్వాడీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగనన్నకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఏసుక్రీస్తును వేడుకుని వినూత్న నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు వి.దుర్గారావు, సుందరయ్య సేవా సమితి కన్వీనర్‌ గాదె సుబ్బారెడ్డి, బి.వెంకటేశ్వర్లు మద్దతుగా మాట్లాడారు. సమ్మెకు రైతు సంఘం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి, డి.విజయబాబు సంఘీభావం తెలిపారు. ఎస్‌కె ఫాతిమా, తబిత, మాణిక్యం, ఎస్‌.కిరణ్మయి, సుజాత, నాగలక్ష్మి, లీల, నిర్మలాదేవి, అశ్విని, ప్రమీల, శ్రీదేవి పాల్గొన్నారు. పెనుమాకలో రైతు సంఘం ఆధ్వర్యంలో అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా సంతకాల సేకరించారు. సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు మాట్లాడారు. నాయకులు ఎస్‌కె పీరూసాహెబ్‌, టి.బక్కిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : అంబేద్కర్‌ సెంటర్లో సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.బాలాజీ మద్దతు తెలిపారు. యూనియన్‌ నాయకులు హేమలత, రుక్మిణి, ఆదిలక్ష్మి, భూలక్ష్మి, స్వర్ణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – దుగ్గిరాల : అంగన్వాడీలకు మద్దతుగా ఇళ్ల వెంట తిరిగి సంతకాల సేకరణ చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఈమని అప్పారావు, జె.బాలరాజు మద్దతుగా మాట్లాడారు. అంగన్వాడీలు జయ. నాగమణి, కల్యాణి, అంజన, సుజాత, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్‌ పోతురాజు, డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : స్థానిక విఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్విఆర్‌ కళాశాల ఎదురుగా తెనాలి విజయవాడ రహదారిపై పక్కన సమ్మె శిబిరంలో చేతులకు సంకెళ్లతో అంగన్వాడీలు నిరసన తెలిపారు. సిఐటియు, సిపిఎం నాయకులు షేక్‌ హుస్సేన్‌ వలి, కె.బాబూప్రసాద్‌ సంఘీభావంగా మాట్లాడారు. యూనియన్‌ నాయకులు ఎవిఎన్‌ కుమారి, అనూరాధ, హసీనా బేగం, నాగమణి, శాంత, కుమారి, జానకి, రాధిక, స్వప్న, హేమలత జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, నాగలక్ష్మి, లావణ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి – కొల్లిపర : సమ్మె శిబిరం కొనసాగుతోంది. సంతకాల సేకరణ చేపట్టారు. యూనియన్‌ మండల అధ్యక్షులు నిర్మలజ్యోతి, నాయకులు వి.హిమాని, శ్రీదేవి, లలిత కుమారి, ఆదిలక్ష్మి, సువర్ణ లత, ఉష, శ్రీలక్ష్మి, కిరణ్‌ కుమారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పెదకాకాని రూరల్‌ : సమ్మె శిబిరంలో సంతకాల సేకరణ చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.శివాజీ మాట్లాడారు. కనకవల్లి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పెదనందిపాడు రూరల్‌ : సమ్మె శిబిరంలో అంగన్వాడీలు తమ తలపై కుర్చీలు పెట్టుకొని నిరసన తెలిపారు. నాయకులు శివపార్వతి, శ్రీదేవి పాల్గొన్నారు. మండల కేంద్రమైన కాకుమానులో చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు కె.శ్రీనివాసరావు, యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు శశికళ, వాసవి మాట్లాడారు.
ప్రజాశక్తి – తాడికొండ : సమ్మె శిబిరం కొనసాగింది. నాయకులు సుబ్బాయమ్మ, విజయలక్ష్మి, కుమారి.శాంతి పాల్గొన్నారు.
ప్రజాశక్తి- మేడికొండూరు : మండల కేంద్రమైన మేడికొండూరులో సమ్మె శిబిరం కొనసాగింది. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.

➡️