సందేశాత్మక ఇతివృత్తం.. అద్భుత అభినయం..

Feb 21,2024 23:44

నాలో నీవే నాటికలో సన్నివేశం
ప్రజాశక్తి – తెనాలి :
వైఎస్సార్‌ నాటక కళాపరిషత్‌ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు బుధవారం మూడో రోజుకు చేరాయి. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యా చిల్డ్రన్‌ ఆర్ట్‌ థియేటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పోటీల్లో తొలి ప్రదర్శనగా కరణం సురేష్‌ మెమోరియల్‌ థియేటర్‌ వారి ‘నాలో నీవే’ నాటికకు బొమ్మిడి రామకృష్ణ రచనా దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఆద్యంతం సందేశాత్మకంగా నిలిచిన నాటకాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. అభినయం, ఆహార్యం ప్రేక్షకుల మన్ననలను అందుకున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ హార్మోనిస్ట్‌ దీపాల సుబ్రహ్మణ్యం, అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకురాలు ఏల్చూరి నాగలక్ష్మిని సత్కరించారు. నాటిక ప్రదర్శనలను ఆరాధ్యుల కన్నా, జి.సుబ్బారావు, గోపరాజు విజరు, లక్కరాజు లక్ష్మణ్‌రావు, కొండపి శ్రీనివాసరావు, డాక్టర్‌ ఎ.మల్లేశ్వరరావు, ప్రముఖ న్యాయ వాది ఎస్‌.శంకర్‌, వై.హనుమంతరావు పర్యవేక్షించారు.

➡️