సచివాలయ వ్యవస్థతోనే ప్రజల వద్దకు పాలన

Feb 19,2024 21:05

ప్రజాశక్తి – సీతానగరం: గ్రామ స్వరాజ్య పాలన సచివాలయం వ్యవస్థ ద్వారానే ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి అని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని పెదభోగిలి పంచాయతీ పరిధిలో రెండో సచివాలయం భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చామన్నారు. గ్రామంలో వందల మీటర్లు సీసీ కాలువలు, రోడ్లతో పాటు నాడు-నేడు ద్వారా పాఠశాలను అభివద్ది చేశామన్నారు. గ్రామంలో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగు నీరు సరఫరా చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములునాయుడు, జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండలపార్టీ అధ్యక్షులు బొంగు చిట్టి రాజు, ఎంపిడిఒ ఎం.ఈశ్వరరావు, ఎఒ ప్రసాద్‌, ఎంపిటిసిలు బురిడి కుసుమ సూర్యనారాయణ, సురగాల గౌరీకిరణ్‌, సర్పంచ్‌ తెరేజమ్మ, పిఎసిఎస్‌ అధ్యక్షులు సాకేటి కుర్మారావు, పలువురు నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️