సబ్దర్‌ హష్మీ ఆశయాలను కొనసాగించాలి

Jan 2,2024 17:04 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలుకార్పొరేషన్‌ : సబ్దర్‌ హష్మీ ఆశయాలను కొనసాగించాలని ప్రజానాట్యమండలి సీనియర్‌ నాయకులు రామాంజనేయులు జీ.బి. మద్దిలేటిలు అన్నారు. మంగళవారం స్థానిక కార్మిక కర్షక భవన్లో జననాట్యమంచ్‌ అధ్యక్షులు ప్రజాకళా కారుడు సబ్దర్‌ హాష్మి 35వ వర్ధంతి కార్యక్రమం కర్నూలు జిల్లా ప్రజానాట్యమండలి అధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ముందుగా పిఎన్‌ఎం సీనియర్‌ కళాకారులు రామాంజనేయులు జి.బి.మద్దిలేటి, జిల్లా కార్యదర్శి రాజు ”హాష్మి” చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ ”సబ్ధర్‌ హాష్మి” 1989- జనవరి 1వ తేదీన ఢిల్లీలో జరుగుతున్న సాధారణ మునిసిపల్‌ఎన్నికల్లో భాగంగా సీపీఎం అభ్యర్థి తరపున ”వీదినాటిక ” ప్రదర్శిస్తున్న కళా కారులపై విచక్షణ రహితంగా అప్పటి కాంగ్రెస్‌ వాళ్ళు తమకు వెళ్ళడానికి దారి ఇవ్వలేదని నాటకం ప్రదర్శిస్తున్న కళాకారులపై కాంగ్రెస్‌ గుండాలు కత్తులతో దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన హష్మీ కోలుకోలేక జనవరి 2వ తేదీన మరణిచడం జరిగిందన్నారు. పి.ఎన్‌.ఏం. జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ ఒక కళాకారుడు మరణిస్తే 1000 మంది కళాకారులు ఉద్భవిస్తారు అని ఎక్కడైతే హాస్మీని చంపారో అదే స్థలం లోనే అతని భార్య ” మలయశ్రీ హాష్మీ” జనవరి 4 వ తేదీన ”ఆగిపోని నాటిక” ను ప్రదర్శించార అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి.ఎన్‌.ఏం. జిల్లా నాయకులు ఏం.లోకేష్‌,పి. నోమేస్వరి ,నాగసుంకన్న ,బాలు, రామకృష్ణ, బి.సరిత, సిఐటియు నాయకులు బతుకన్న,రజక సంఘం నాయకులు గురుశేకర్‌ పాల్గొన్నారు.

➡️