సమగ్రశిక్ష ఉద్యోగులపై చిన్నచూపు

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమగ్రశిక్ష ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శనివారం పార్వతీపురంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. ఈ శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ పిఆర్‌సి అమలు చేయకుండా, నెలల తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. మినిమం టైమ్‌స్కేల్‌పై జిఒలు విడుదల చేసినా అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు, విభజన సృష్టించే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సంప్రదాయాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో ఒకే కేడర్‌ ఉద్యోగులకు రకరకాల వేతనాలు చెల్లిస్తూ, కొత్త విధానాలకు తెరలేపారని మండిపడ్డారు. పార్ట్‌ టైం పేరుతో తక్కువ జీతాలు ఇచ్చే విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని విభాగాలకు, కెజిబివి టీచర్లకు అరకొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఎన్నికల కంటే ముందు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీనిచ్చి ఏ ఒక్క సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. వెంటనే డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి సిపిసి మన్యం జిల్లా అధ్యక్షులు చుక్క గణపతి, జెఎసి జిల్లా నాయకులు ఎ.పోలినాయుడు, బి.ఈశ్వరరావు, సిహెచ్‌.భానుప్రకాశ్‌, ఎ.దివాకర్‌, కె.భారతి, జి.రమేష్‌, వై.గౌరమ్మ, తదితరులు పాల్గొన్నారు.సిఐటియు మద్దతునిరవధిక సమ్మె చేపడుతున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు ఒక ప్రకటనలో మద్దతు తెలిపారు. న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. మహిళా పోలీస్‌కు ఎస్‌ఐ పోస్టుప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌మండలంలోని నర్సిపురం సచివాలయంలో మహిళా పోలీస్‌గా పనిచేస్తున్న భవ్య ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికైంది. నర్సిపురం గ్రామానికి చెందిన వెంపల గురురాజు అనురాధ కుమార్తె వెంపల భవ్య.. ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించి, సచివాలయ మహిళా పోలీస్‌ పరీక్షలకు హాజరై, ఎంపికైంది. అదే గ్రామంలో సచివాలయ మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో ఎస్‌ఐగా ఎంపికైంది. మహిళా పోలీస్‌ నుంచి ఎస్‌ఐగా మారిన భవ్యను గ్రామస్తులు అభినందించారు.

➡️