సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు

సమ్మె చేస్తున్న ఉద్యోగులు (ఫైల్‌)
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సమ్మెలో ఉన్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నతాకారులు నోలీసులు జారీ చేశారు. ఉద్యోగాలు పొందిన సందర్భంలో ఒప్పంద పత్రాల్లోని అంశాలను ఉదహరిస్తూ షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో తాము బుధవారం నుండి విధుల్లో చేరుతున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. అయితే ఎన్నికల్లో మాత్రం ఈ ప్రభుత్వానికి సరైనరీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర అంశాలపై ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జేఏసీ ఆధ్వర్యంలో 21 రోజులగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. తాజాగా ఉన్నతాధికారుల నోటీసులతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటోందని, సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులకు పాల్పడ్డం దుర్మార్గపు చర్యని అన్నారు.

➡️