సమగ్ర శిక్ష ఉద్యోగుల పై ఎందుకీ వివక్ష

Dec 30,2023 21:09

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సమగ్ర శిక్ష ఉద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకీ వివక్ష అని ఎస్‌ఎస్‌ఎ నాయకులు ప్రశ్నించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 11వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో శనివారం పార్వతీపురం చర్చి జంక్షన్‌లోని నిరసన శిబిరం నుండి పార్వతీపురం కలెక్టర్‌ ఆఫీస్‌ మీదుగా ఆర్‌టిసి కాంప్లెక్స్‌, సౌందర్య జంక్షన్‌ వరకు కోలాటం చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు ఈశ్వరరావు, లక్ష్మణరావు, రమేష్‌ తదితరులు మాట్లాడుతూ విద్యాశాఖలో అత్యున్నతమైన సేవలు అందిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావంగా పిఆర్‌టియు నాయకులు వి. తవిటి నాయుడు, టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బోనేల రవిచంద్ర తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో జెఎసి నాయకులు భాను ప్రకాష్‌, బివి రమణ, భారతి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️