సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల మనవహారం

Dec 22,2023 20:42
ఫొటో : మానవహారం చేపడుతున్న అంగన్‌వాడీ టీచర్లు

ఫొటో : మానవహారం చేపడుతున్న అంగన్‌వాడీ టీచర్లు
సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల మనవహారం
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : అంగన్‌వాడీ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎంపిడిఒ కార్యాలయం నుండి అంగన్‌వాడీలు ప్రదర్శనగా బయల్దేరి ఉదయగిరి రోడ్డు కూడలిలో మానవహారం చేపట్టారు. ఈ మానవహారంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఈ రమాదేవి, వజ్రమ్మ, కామేశ్వరీ సిఐటియు నాయకులు కర్ర పోలయ్య మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 11రోజుల నుండి నిరవధికంగా పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి స్పందించలేదన్నారు. అక్కచెల్లెమ్మల పాలన అని చెప్పి ఇప్పుడు అక్కాచెల్లెమ్మలకు న్యాయం చేయకుండా భీష్ముంచుకొని ఉన్నాడని విమర్శించారు. ఆయన పుట్టిన రోజు నాడు కేకులు కట్‌ చేసుకుని సంబరాలు జరుపుకుంటే తాము కొంగు పట్టుకొని భిక్షాటన చేసి వీధులెక్కి పోరాటాలు చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య, వ్యకాసం నాయకులు టి.మాల్యాద్రి, ఉలవపాడు మండల సిఐటియు నాయకురాలు సిహెచ్‌ ఇందిరమ్మ, వై.కృష్ణమోహన్‌, జి మధుసూదన్‌ రావు, అంగన్‌వాడీ నాయకులు కె.సుభాషిని, కళావతి, సౌజన్య, సుకన్య, పెంచలమ్మ, హిమబిందు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️