సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌కు వినతి

Jan 5,2024 21:27

ప్రజాశక్తి – పాచిపెంట :  మండలంలోని ఎపి గిరిజన సంక్షేమ గురుకులంలో తమ సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావుకు వినతిని అందజేశారు. మినీ గురుకులాలు ప్రారంభం నుంచి పనిచేస్తున్న తమకు జీతాలు పెరగలేదని తక్కువ జీతాలతో జీవనం కొనసాగించడం ఇబ్బందిగా ఉందని, మినిమం టైం స్కేల్‌ విధానం వర్తింపజేసేలా చూడాలని చైర్మన్‌ను కోరారు. ఈ సందర్భంగా ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ మినీ గురుకులం కాంట్రాక్ట్‌ మరియు ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

➡️